హైదరాబాద్ : మేడారంలో గిరిజన, ఆదివాసీ సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖకు విజ్ఞప్తి చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతర, అత్యంత భారీ స్థాయిలో జనసమూహం హాజరయ్యే అతి పెద్ద గిరిజన జాతరని బీజేపీ పేర్కొంది. ఫిబ్రవరి 5-8 వరకు వరంగల్ జిల్లాలోని ఏటూరు నగరం అభయారణ్యం వద్ద గల మేడారంలో జరగనుంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేడారం జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని గిరిజన కళాకారులను ఆహ్వానించాలని, ఆయా రాష్ట్రాల నుండి వచ్చే కళాకారుల ప్రధర్శనకు అన్నీ రకాల ఏర్పాట్లు చేయాలని, వారి సాంప్రదాయ గిరిజన నృత్యాల, కళా రూపాల ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు పరస్పరం తెలుసుకుంటారని పేర్కొంది. 


నేపథ్యం 


వరంగల్ జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, దేశంలోనే వనదేవతులుగా పూజలందుకుంటున్న సమ్మక్క-సారక్క. "దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర"గా ఖ్యాతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది .



జాతర విశేషాలు 


మేడారం జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆహ్వానం పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనులే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర, ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.



తెలంగాణా కుంభమేళా


తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కానీ 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు.


 



ప్రతి సంవత్సరం జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణాలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుండి సుమారుగా కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..