హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇతర పార్టీల మాదిరిగా టీఆర్ఎస్ పార్టీకి పొత్తులతో అవసరం లేదని అన్నారు ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి భాను ప్రసాద్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ ప్రమేయం లేకుండా ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు డా కే లక్ష్మణ్ ప్రకటించడంపై స్పందిస్తూ భాను ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.