Reverse Akarsh: అప్పుడు వచ్చారు.. ఇప్పుడు పోతున్నారు! రివర్స్ ఆకర్ష్ తో గులాబీలో గుబులు..
Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది.
Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్. 2014లో 63 సీట్లు గెలిచింది కారు పార్టీ. ఇది మేజిక్ ఫిగర్ కన్నా కేవలం మూడు సీట్లు మాత్రమే ఎక్కువ. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు కేసీఆర్. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేపై ఆకర్ష్ వల విసిరి గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. 2018 ఎన్నికల నాటికి అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 80 దాటేసింది. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో అధికారికంగా విలీనమయ్యారు. 2014లో టీడీపీ 15 సీట్లు గెలిచింది. కేసీఆర్ ఆకర్ష్ తో తమ్ముళ్లు ఒక్కొక్కరుగా కారెక్కారు. 2017 నాటికి టీడీఎల్పీ కూడా అధికార పార్టీలో విలీనమైంది. ఇక 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టింది. అయినా ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగించారు గులాబీ బాస్. తొలి దఫాలో టీడీపీని ఖతం చేసిన కేసీఆర్.. సెకండ్ టర్మ్ లో కాంగ్రెస్ పని పట్టారు. కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. ఆపరేషన్ ఆకర్ష్ తో 12 మందిని కారెక్కించి అసెంబ్లీలో సీఎల్పీని అధికారికంగా టీఆర్ఎస్పీలో విలీనం అయ్యేలా చేశారు.
గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ బీజేపీలో చేరారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లారు. ఇటీవల కాలంలో గులాబీ పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. అధికార టీఆర్ఎస్ నుంచి రోజుకో లీడర్ ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. కొందరు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. మరికొందరు కమలం కండువా కప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నాపని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. అధికార పార్టీ నేతలను ఆకర్షించేందుకు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ఏకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి విపక్ష పార్టీలు. కాంగ్రెస్ చేరికల కమిటీ చీఫ్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి ఉండగా.. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలోకి లాగడమే ఈ కమిటీల పని.
ఇటీవలే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లో చేరారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి జడ్పీటీసీ కారు దిగి గాంధీభవన్ చేరాడు. రెండు రోజుల క్రితమే బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ హస్తానికి జై కొట్టారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి అధికార పార్టీలో చేరిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. పాలమూరు, ఖమ్మం జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు కూడా త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ రాజేందర్ కూడా తనదైన శైలిలో చేరికలకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. విపక్షాలు చేరికలతో దూకుడు పెంచగా.. వాళ్లకు కౌంటర్ గా తమ పార్టీలోకి నేతలను లాగాలని గులాబీ పార్టీ ముఖ్య నేతలు చూస్తున్నా వర్కవుట్ కావడం లేదని తెలుస్తోంది. కార్పొరేటర్ స్థాయి నేతల తప్ప ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. కార్పొరేటర్లకు కూడా భారీగా తాయిలాలు ఇచ్చి జాయిన్ చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తంగా తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను బలహీనం చేయాలని చూసిన కేసీఆర్ కు ఇప్పుడు రివర్స్ ఆకర్ష్ మొదలైందనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటికి ఎవరెవరు వస్తారు అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది.
Also read:ENG vs IND 5th Test: చెత్త బౌలింగ్.. టీమిండియా బౌలర్లపై సెహ్వాగ్ ఫైర్!
Also read:KCR U TURN: పాలిటిక్స్ వదిలేసి పాలనపై ఫోకస్! రూట్ మార్చిన కేసీఆర్.. పీకే నివేదికే కారణమా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook