TRS Minister KTR writes Open Letter to Central Government over Petrol, Diesel prices hiked: బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం, ధర్మం కోసం అంటారని.. పెట్రోల్, డీజిల్ ధరలపై చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, ధర్మం కోసమేనా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా లేదా తగ్గినా.. దేశంలో రేట్లు పెంచడమే కేంద్ర ప్రభుత్వం తమ పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంభిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన కేటీఆర్.. వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు బహిరంగ లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే కేంద్ర ప్రభుత్వం తమ పనిగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. పన్నులు పెంచడమే పరిపాలనగా బీజేపీ భ్రమిస్తున్నది. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపీదే. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 


'ప్రతిది దేశం కోసం, ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా.. దేశం కోసం, ధర్మం కోసమేనా?. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుంది. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం' అని పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. 


దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. నేడు లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 80 పైసలు పెరిగాయి. మార్చి 22 నుంచి ఇంధన ధరలు పెరగడం ఇది 14వ సారి కావడం విశేషం. ఈ 16 రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.10 పెరిగాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.120కి చేరువకాగా.. డీజిల్‌ కూడా వంద దాటింది. పెరుగుతున్న ఈ ధరలు సామాన్యుడిని జేబుని లూటీ చేస్తున్నాయి. దాంతో అందరూ కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. 


Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 అరుదైన రికార్డు.. మొదటి కన్నడ సినిమాగా..!


Also Read: KKR vs MI: టాస్ గెలిచిన కోల్‌కతా.. సూర్య వచ్చేశాడు! ముంబై బోణి కొట్టేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook