TRS VS BJP: బీజేపీ నేతల్లారా ఇండ్లలో చెప్పి బయటికి రండి! టీఆర్ఎస్ మంత్రుల వార్నింగ్
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది.
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది. కవిత ఇంటి ముట్టడికి బీజేపీ ప్రయత్నించగా.. వాళ్లను టీఆర్ఎస్ కార్యకర్తలు తరిమికొట్టారు. ఈ ఘటనే ఇప్పుడు తెలంగాణలో మంట పుట్టిస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి, కేసులు పెట్టడానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. అటు టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు.
బీజేపీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఖబర్దార్ బీజేపీ నాయకులరా.. ఇండ్లలో చెప్పి బయటకు రండి అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ జోలికి వస్తే రోడ్ల మీద తిరగకుండా చేస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. కేసీఆర్ కి భయపడి అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కేడర్ ను టచ్ చేస్తే మాడిపోతారని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మహిళ నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని మండిపడ్డారు.ఎవరు మంచి పని చేస్తే వారిపై ఈడి కేసులు పెడుతున్నారని అన్నారు.
వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కవిత ఇంటి దగ్గరకు ఎలా వస్తారని నిలదీశారు. ఇలా ఇంటికి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అన్నారు తలసాని. టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా?.. మేం తలుచుకుంటే బీజేపీ నేతలు రోడ్లపై తిరగగలారా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు. వేలాది సైన్యం మాకు ఉంది, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫిస్ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? అంటూ కమలనాధులకు వార్నింగ్ ఇచ్చారు.
Read also: BANDI SANJAY ARRET: జనగామ జిల్లాలో బండి సంజయ్ అరెస్ట్.. ధర్మదీక్షను భగ్నం చేసిన పోలీసులు
Read also: MLA RAJA SINGH ARREST: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. వివాదాస్పద వీడియో డిలీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి