Hyderabad Drugs Case: హైదరాబాద్‌ రాడిసన్ బ్లూ హోటల్‌లో పోలీసులు భగ్నం చేసిన డ్రగ్స్ పార్టీ కేసుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన జాబితాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడు ప్రణయ్ రెడ్డి పేరు ఉందన్నారు. బీజేపీ సీనియర్ నేత ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్ పేరు కూడా జాబితాలో ఉందన్నారు. పబ్ ఓనర్ అభిషేకే అని పేర్కొన్నారు. ఆ పార్టీలో పాల్గొన్నదంతా కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెందిన పిల్లలే అని ఆరోపించారు. ఎవరిని షూట్ చేయాలో... ఎవరిని ఉరి తీయాలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలని విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకా చాలా మంది నాయకుల పిల్లలు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోందని... అన్నీ బయటకొచ్చాక మాట్లాడుతామని బాల్క సుమన్ అన్నారు. నిన్న పట్టుబడినవారిలో కొంతమందిని కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీ నేతల నిజ స్వరూపం బయటపడిందని... ఇకనైనా ఆ రెండు పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.


రేవ్ పార్టీ సమాచారం అందిన వెంటనే పోలీసులు పక్కా ప్లాన్‌తో నాలుగైదు గంటలు వేచి చూసి పబ్‌పై దాడులు జరిపారన్నారు. అక్కడున్న అందరినీ పట్టుకుని ఈ వ్యవహారాన్ని బయటపెట్టారని... ప్రభుత్వ చిత్తశుద్దికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పలువురు నాయకుల పిల్లలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద వీరంగం చేసినట్లు తెలిసిందన్నారు. తప్పు చేసింది కాక పోలీసులపై ఎగిరితే కుదరదన్నారు. ఈ కేసు విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ కఠినంగా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్, గంజాయి, గుడుంబా వంటి విషయాల్లో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని... ఈ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. 


Also Read: Viral Video: కన్న కొడుకుకి స్తంభానికి కట్టేసి.. కంట్లో కారం చల్లిన తల్లి! ఎందుకో తెలుసా?


Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు... ఎఫ్ఐఆర్‌లో ఆ నలుగురి పేర్లు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook