Case filed on TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డిపై హైదరాబాద్‌లోని జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా తహశీల్దార్ గౌతం రెడ్డి తలదూర్చి తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించడంతో.. కోర్టు ఆదేశాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలో సర్వే నంబర్ 152లో 90 ఎకరాల భూమి గత కొన్నేళ్లుగా వివాదంలో ఉంది. ఈ వివాదంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా ఎమ్మార్వో తలదూర్చి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మార్వో గౌతం రెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టుకు వెళ్లారు. భూ తగదా విషయంలో స్థానిక ఎమ్మార్వోతో కలిసి సెటిల్మెంట్స్‌కి పాల్పడుతున్న సుభాష్ రెడ్డి.. తమ మాట వినకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతం రెడ్డిపై ఐపీసీ 120,166a,167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 సెక్షన్ల కింద జవహార్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 


Also read : Corona Antibody Cocktail: కరోనాకు కాక్‌టెయిల్ మందు, ఇండియాలో అనుమతి


గతేడాది హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ఉప్పల్ కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని (Uppal MLA Bethi Subhash Reddy) అక్కడి స్థానిక మహిళలు నిలదీయగా.. ''ఇక్కడ ఇల్లు ఎవరు నిర్మించుకోమని చెప్పారు'' అంటూ వారితో ఆయన వాగ్వీవాదానికి దిగిన ఘటన కూడా తెలిసిందే. ఆ తర్వాత ఆయన మళ్లీ ఇలా భూ వివాదం కేసుతో వార్తల్లోకెక్కారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook