TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సిట్ ఏర్పాటు.. స్టీఫెన్ రవీంద్ర ఎక్కడ ?
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు నేతృత్వం వహించనున్నారని తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ విభాగం డీసీపీ కమలేశ్వర్ శింగెనవర్, సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ బి గంగాధర్, ఈ కేసు నమోదైన మొయినాబాద్ పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ లక్ష్మి రెడ్డి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సభ్యులుగా ఉంటారు.
తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోన్న సున్నితమైన కేసు కావడంతో దర్యాప్తులోనూ ఎంతో నైపుణ్యం ఉన్న పోలీసు అధికారులతో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ డీజీపీ పంపించిన ప్రతిపాదనను ఆధారంగా చేసుకుని తెలంగాణ సర్కారు ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇదిలావుంటే, ఈ కేసుపై మొట్టమొదటిసారిగా ఫిర్యాదు అందుకుని, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌పై ఆకస్మిక దాడులు జరిపి నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేరు మాత్రం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారినే ఎంపిక చేసుకునే క్రమంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేరు కనుమరుగైందా లేక ఉద్దేశపూర్వకంగానే సిట్ బృందంలోకి సైబరాబాద్ సీపీని తీసుకోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : KCR Allegations on BJP: బీజేపీపై కేసీఆర్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook