Delhi Liquor Scam Case: కవిత సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు అందుకేనా ?
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్‌కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. సదరు చార్టెడ్ అకౌంటెంట్ మరెవరో కాదు.. రాబిన్ డిస్టిలరీస్ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా సేవలు అందిస్తున్న గోరంట్ల బుచ్చిబాబే.
Delhi Liquor Scam Case: అవును, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రాబిన్ డిస్టిలరీస్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమన్లు జారీచేసింది. మంగళవారం తమ ఎదుట హాజరు కావాలంటూ సిబిఐ తమ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే గోరంట్ల ఆఫీసులో సిబిఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కవిత, రామచంద్రయ్య పిళ్ళైతో పాటు ప్రముఖులకు సీఏగా గోరంట్ల బుచ్చిబాబు
ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో భారీ మొత్తంలో అవినీతికి తెరతీసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబిన్ డిస్టిలరీస్‌కి చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబుకు ఇతర ప్రముఖులతో ఇంకొన్ని కామన్ కనెక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే.. గోరంట్ల బుచ్చిబాబు అనే చార్టెడ్ అకౌంటెంటే రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రామచంద్రయ్య పిళ్ళై తోపాటు పలువురికి చార్టెడ్ అకౌంట్‌గా పనిచేస్తుండటం.
కవితకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకేనా ?
అంతేకాదు.. ఇప్పుడు పైన చెప్పుకున్న ముగ్గురి మధ్య.. బోయినపల్లి అభిషేక్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రామచంద్రయ్య పిళ్ళై మధ్య స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అన్నింటికిమించి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టుగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఇదే గోరంట్ల బుచ్చిబాబు సీఏగా ఉన్న నేపథ్యంలో మంగళవారం నాడు సీబీఐ విచారణలో అతడిని ప్రశ్నించే క్రమంలో కవితకు సంబంధించి అతడికి తెలిసిన కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉచ్చు బిగిస్తున్నారా ?
చిన్నచిన్నగా కవితతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో లింక్స్ ఉన్న వాళ్లను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తుండటం, ఇంకా అవసరమైతే ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్రమక్రమంగా కవిత ( TRS MLC Kalvakuntla Kavitha ) చుట్టూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక పథకం ప్రకారమే ఉచ్చు బిగిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?
Also Read : Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి