TRS MLC Kavitha : కేంద్ర మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్‌ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు ‌వచ్చి రేషన్‌ ‌షాపులలో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారని, మోది ఫోటో గ్యాస్‌ ‌సిలెండర్‌పై, యూరియా బస్తాలపై తప్పక పెడతామని అన్నారు. వాట్సాప్‌లలో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని ఆమె అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేదలకు పించన్లు ఎందుకిస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్‌, ‌ఫీజ్‌ ‌రియెంబర్స్‌‌మెంట్‌ ఇవ్వద్దని నరేంద్ర మోది చెబుతున్నారని అన్నారు. కొన్ని రోజుల నుండి ఫేస్‌‌‌బుక్‌, ‌వాట్సాప్‌ ‌యూనివర్సిటిల్లో చెక్కర్లు కొడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌పెద్ద కొడుకుగా ఉండి పించన్లు ఇస్తున్న సందర్బంలో ఇంకా కొద్ది మందికి పించన్లు రావట్లేదని గుర్తించి వారికి కూడా పించన్లు ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వయస్సు తగ్గించి 57 సంవత్సరాల వారికి కూడా పించన్లు అందిస్తున్నారని గుర్తు చేశారు. 50 వేల పైచిలుకు పించన్లను నిజామాబాద్‌ ‌జిల్లాలో ఇస్తున్నారని అన్నారు. 


భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయని అందులో కేవలం తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో పించన్‌లు ఇస్తున్నారని పక్కనున్న మహారాష్ట్రలో ఎంత ఇస్తున్నారో పక్కనే ఉన్న మహారాష్ట్రతో అనుబంధం ఉన్న వారికి తెలుసన్నారు. మొదటి విడతలో ఇంటికి ఒక్కరికి పించన్‌ ఇస్తున్నారని రాబోయే రోజుల్లో ఇంట్లో ఇద్దరికి పించన్లు ఇచ్చేలా సంపద పెరగాలని దీవించాలన్నారు. అర్బన్‌లో 60 వేల కుంటుంబాలు ఉన్నాయని అందులో 40 వేల కుటుంబాలకు పించన్లు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌కు అండగా నిలవాలని అన్నారు. అనంతరం కవిత ( TRS MLC Kavitha ) ఆసరా లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు.


Also Read : TRS MLC Kavitha: నిజామాబాద్ సభలో ఎమ్మెల్సీ కవిత మౌనం వెనుకున్న కారణం ?


Also Read : Free Electricity Supply: దేశం మొత్తం ఉచిత విద్యుత్ ఇస్తా.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి