TRS suspends Vanama Raghava: పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో (Palwancha family suicide cases) ఆరోపణలు ఎదుర్కొంటున్న.. టీఆర్​ఎస్​ నేత, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై సస్పెన్షన్ వేటు పడింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం (Vanama Raghava suspended from TRS) తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని టీఆర్​ఎస్ పార్టీ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమిటి అసలు వివాదం..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో ఈ నెల 3న వ్యాపారి  రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (Palwancha family suicide cases details) పాల్పడింది. రామకృష్ణ ఆస్తి వివాదంలో.. వనమా రాఘవేంద్రరావు అలియాస్‌ రాఘవ.. కలుగుజేసుకొని వేధింపులకు పాల్పడపటం వల్లనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.


ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి బయటకి రావడం, అందులో చెప్పిన వివరాల ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదం వీడి.. న్యాయం జరగాలంటే తన భార్యను పణంగా పెట్టాలని రాఘవ కోరినట్లు రామకృష్ణ ఆ వీడియోలో పేర్కొన్నారు. లేదంటే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కదని హెచ్చరించినట్లు చెప్పారు. రాఘవ ఆరచకాలు తాలలేకే.. తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని తీసుకుపోతున్నట్లు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వీడియోతో.. రాఘవ ఆగడాలు బయటకు వచ్చాయి. గతంలోను రాఘవ ఇలాంటి అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ ఆరోపణలో నేపథ్యంలో పరారీలో ఉన్న రాఘవను అరెస్ట్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న రాఘవను అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా అందులో నిజం లేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతడు దొరికితే.. ఆధారాలు సేకరించి రౌడీషీట్ తెరుస్తామని చెప్పారు. ఈ కేసుతో పాటు.. గతంలోన నమోదైన కేసులపైనా దర్యాప్తు చేస్తామని వివరించారు.


Also read: Vanama Raghava: వనమా రాఘవ అరాచకాల చిట్టా.. ఇప్పటివరకూ ఎన్ని నేరాలకు పాల్పడ్డాడంటే


Also read: Vanama Raghava : వనమా రాఘవ అరెస్టు వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook