MP Kesava Rao tests covid 19 positive: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు కరోనా బారినపడ్డారు. మంగళవారం (డిసెంబర్ 28) ఒంట్లో కాస్త నలతగా ఉండటం, స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో కేశవరావుకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నిమ్స్ వైద్యులను సంప్రదించిన కేశవరావు.. వారి సూచన మేరకు క్వారెంటైన్‌లోకి వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో చర్చించేందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల బృందం ఇటీవల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కేశవరావు కూడా కరోనా బారినపడటంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన బృందం కాస్త ఆందోళనకు గురవుతోంది.


కరోనా కేసుల విషయానికొస్తే... రాష్ట్రంలో మంగళవారం (డిసెంబర్ 28)  కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. కరోనాతో మరొకరు మృతి చెందగా... కోవిడ్ 19 మృతుల సంఖ్య 4024కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3459 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇక కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Telangana) నమోదైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి చేరింది. వీరిలో ఇప్పటివరకూ 13 మంది కోలుకున్నారు. మరోవైపు, 100 శాతం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం విశేషం.


Also Read: Rains in Telangana: ఇవాళ తెలంగాణకు వర్ష సూచన.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook