టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల జాబితా విడుదలైంది. ప్రగతిభవన్ లో గురువారం సాయంత్రం  సీఎం కేసీఆర్  17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు.  16 సీట్లలో విజయమే  లక్షంగా పెట్టుకున్న కేసీఆర్.. తీవ్ర కసరత్తు చేసి లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించారు. అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ముందుగా ఊహించినట్లే  ముగ్గురు సిట్టింగులు భంగ్గుపాటు ఎదురైంది. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో నామా నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి స్థానంలో మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌లో సీతారాం నాయక్‌ స్థానంలో మాలోతు కవితకు చోటు కల్పించారు. 


* ఎంఐఎంతో దోస్తీ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి స్నేహపూర్వక పోటీలో భాగంగా నామమాత్రంగా అభ్యర్థిని పోటీలో నిలిపారు. అలాగే చేవెళ్ల  నుంచి టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో ఈ స్థానంలో పారిశ్రామికవేత్త రంజిత్‌ రెడ్డిని బరిలో దించుతున్నట్టు ప్రకటించారు.


* నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డిని నిలబెట్టాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. చివరి నిమిషంలో మార్పులు చేసి వేంరెడ్డి నర్సింహారెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పెద్దపల్లి స్థానం కోసం జి.వివేక్‌కు చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ స్థానాన్ని కొత్త అభ్యర్ధి ఎన్‌. వెంకటేశ్‌ కేటాయించారు

అభ్యర్థుల జాబితా ఇదే..
 


ఆదిలాబాద్‌ - జి.నగేశ్‌
నిజామాబాద్‌ - కవిత
కరీంనగర్‌ - బి. వినోద్‌ కుమార్‌
పెద్దపల్లి - ఎన్‌. వెంకటేశ్‌ 


మెదక్‌ - కొత్త ప్రభాకర్‌ రెడ్డి
జహీరాబాద్ - బీబీ పాటిల్‌
మల్కాజ్‌గిరి - మర్రి రాజశేఖర్‌ రెడ్డి
చేవెళ్ల - రంజిత్‌ రెడ్డి


హైదరాబాద్‌ - పుస్తె శ్రీకాంత్‌ రెడ్డి
సికింద్రాబాద్ - తలసాని సాయికిరణ్‌
నాగర్‌కర్నూలు - పి. రాములు
వరంగల్‌ - పసునూరి దయాకర్‌


మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌ రెడ్డి
మహబూబాబాద్‌ - మాలోతు కవిత
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
నల్గొండ -  వేంరెడ్డి నర్సింహారెడ్డి
భువనగిరి - బూర నర్సయ్యగౌడ్‌