Big Shock To TRS: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోంది. సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.నల్లాల ఓదేలు ఢిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అతన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. రాహుల్ సమక్షంలోనే నల్లాల ఓదేలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లాల ఓదేలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న నల్లాల ఓదేలు.. 2014లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓదేలుకు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. చెన్నూరు నుంచి బాల్క సుమన్ పోటీ చేశారు. అప్పుడే ఓదేలు పార్టీ మారుతారని భావించారు. కాని ఆయన కారు పార్టీలోనే కొనసాగారు. తర్వాత ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా నియమించారు కేసీఆర్.


అయితే ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఆయన విభేదాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అవి మరింతగా ముదిరిపోయాయి. నియోజకవర్గంలో బాల్క సుమన్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని నల్లాల ఓదేలు ఆరోపిస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనే ఆవేదనలో ఉన్నారు. అందుకే పార్టీ మారాలని ఓదేలు నిర్ణయం తీసుుకున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్ లోకి వెళ్లిన ఓదేలు పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. దీంతో ఓదేలును తీసుకుని ఢిల్లీకి వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన భార్య మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మితో పాటు మరికొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఓదేలుతో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది.  


READ ALSO: Minister Mallareddy: మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. బావమరిదిపై భూ కబ్జా కేసు


READ ALSO: ACB Mobile APP: ఒక్క బటన్ నొక్కితే చాలు అవినీతి అధికారి అవుట్.. ఏపీ సర్కార్ కొత్త మొబైల్ యాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook