ఎన్నికలు దగ్గరపడుతున్ననేపథ్యంలో టీఆర్ఎస్ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. కాంగ్రెస్ ముఖ్య నేతల నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నియోజకవర్గాలను గుర్తించిన గులాబీ దళపతి.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంచనా వేస్తూ అందుకు తగ్గట్టు వ్యహాలను సిద్ధం చేశారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధి గెలుపుకోసం తీసుకోవాల్సిన అంశంపై ప్రత్యే చర్యలు తీసుకోనున్నారు. కాగా అభ్యర్ధులతో పని లేకుండా ఇన్ ఛార్జ్ లే గెలుపు బాధ్యత తీసుకుంటారు. టీఆర్ఎస్ ఎంపిక చేసిన నియోజకవర్గాలు వర్గాలు.. ఎంపిక చేసిన ఇన్ ఛార్జ్ ల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక ఇన్ ఛార్జ్ లు వీరే ..


* రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్.. డీకే అరుణ స్థానం గద్వాల్ తో పాటు ఆలంపూర్, మత్కల్  నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ గా హరీష్ రావు ఎంపిక 
* బెల్లంపల్లి, చెన్నూరు,ఆసీఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా వేణుగాపాలచారి, శ్రవణ్ కుమార్‌ల ఎంపిక 
* ఉమ్మడి వరంగల్ లోని నర్సంపేట, మహాబూబాద్ లు పార్టీ ముఖ్య నేత పల్లా రాజేశ్వరరెడ్డికి బాధ్యతలు అప్పగింత
* పీసీసీ అధ్యక్షుడు హుజూర్ నగర్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ గా టీఆర్ఎస్ ఎంపీ లింగయ్యయాదవ్ కు బాధ్యతలు 
* తుంగతుర్తి నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా బూర నర్సయ్యగౌడ్ ఎంపిక
* కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తున్న నల్గొండ నియోజకవర్గానికి తక్కెలపల్లి రవీందర్ రావును ఎంపిక
* కోదాడ ఇన్ ఛార్జ్ గా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇన్ ఛార్ట్ గా నియమించారు



సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల నియామకాలు ఇంకా పూర్తికాలేదు. సాధ్యమైనంత త్వరలో ఆయా నియోజకవర్గాలకు సంధించిన ఇన్ ఛార్జ్ లను నియమించి ఎన్నికల క్రేత్రంలో ప్రత్యేక వ్యూహంతో వెళ్లాలని టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది


ఇన్ ఛార్జ్ ల బాధ్యతలు ఇవే..
కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధిచిన నియోజకవర్గాల్లో పరిస్థితలను అంచనా వేసి అందుకు తగ్గట్టు వ్యహాలను రచించే బాధ్యత ఇన్ ఛార్జ్ లదే. ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ సమయానికి తగిన వ్యూహాలను మార్చుతూ పార్టీ విజయం కోసం కృషి చేయాల్సి ఉంది. పోలింగ్ తేదీ నాటికి ప్రత్యర్ధి పార్టీల వారిని బలహీన పర్చడం.. తమ పార్టీ అభ్యర్ధుల గెలుపొందడంపై ఇన్ చార్జ్ లు ప్రత్యేక దృష్టి పెడతారు. కాగా ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సి వ్యూహంపై కేసీఆర్ ఎప్పటి కప్పుడు ఇన్ ఛార్జ్ లకు దిశ నిర్దేశం చేస్తుంటారు.