TRS stages protests, demands Centre to procure entire paddy yield: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) యాసంగిలో వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ (CM KCR‌) పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని (paddy yield) కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు, (TRS MLAs) ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుదంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. 


తెలంగాణ రైతులపై (Telangana farmers) కేంద్రం కక్ష్య కట్టిందంటూ మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. సూర్యపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.


Also Read :smoking inside flight: విమానంలో సిగరెట్ తాగిన ఆంధ్ర వ్యక్ వ్యక్తి- చైన్నైలో అరెస్ట్​


నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indra Karan Reddy) ధ‌ర్నా నిర్వహించారు. వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిర‌సిస్తూ ధ‌ర్నా చేప‌ట్టామ‌న్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుంద‌న్నారు. 


నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులతో ధ‌ర్నా నిర్వహించారు. తెలంగాణ (Telangana) వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్లకార్డ్ ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు.


Also Read :India Vs New Zealand Series: న్యూజిలాండ్ తో టెస్టులకు ఇండియన్ టీమ్ ప్రకటన.. రోహిత్, పంత్, షమీకి విశ్రాంతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి