Khammam Murder: తుమ్మల ప్రధాన అనుచురుడు దారుణ హత్య.. స్వాతంత్ర దినోత్సవం రోజునే దారుణం
Khamam Murder: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్థారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యాడు
TRS Leader Murder: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం తెల్థారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. కృష్ణయ్య బైక్‌పై ఆయన వెళ్తుండగా దుండగులు అడ్డగించి ఆటోతో ఢీకొట్టారు. అనంతరం ఆరుగురు వ్యక్తులు కృష్ణయ్యపై వేటకొడవళ్లతో దాడి చేశారు. కిరాతకంగా హతమార్చారు. అనంతరం దుండగులు మృతుడి రెండు చేతులు తీసుకెళ్లారు.
హత్యకు గురైన కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు. ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు. మృతుడి భార్య ఇండిపెండెంట్ ఎంపిటీసిగా గెలిచి, టీఆర్ఎస్ సానుభూతి పరులుగా కొనసాగుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే దారుణ హత్య జరగడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. హత్య జరిగిన స్పాట్ ను పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
మరోవైపు తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పహారా కాస్తున్నారు. తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
తుమ్మల కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య అనుచరుల ఆందోళనతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఖమ్మం పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందనే ప్రచారంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.
Read also: CM Jagan: మీడియా కొందరికి భజన చేస్తుందని సమరయోధులు ఊహించారా? జెండా పండుగలో సీఎం జగన్ ప్రశ్న..
Read also: Tirumala: భక్తులకు 40 గంటలు.. మంత్రి అనుచరులకు నిమిషాల్లో దర్శనం! తిరుమలలో వైసీపీ నేతల దౌర్జన్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి