Food Arrangemnets for TRS Plenary: టీఆర్ఎస్‌  ఆవిర్భావ పండుగకు హైదరాబాద్‌ ముస్తాబైంది. స్వాగత తోరణాలతో ఇప్పటికే నగరం మొత్తం గులాబీమయమైంది. 33 జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరుకానున్నారు. వారి కోసం ఘుమఘుమలాడే.. వంటకాలను సిద్ధం చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. టీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తికావడంతో ఈ నెల 27న (రేపు) హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా ప్లీనరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీకి అన్ని జిల్లాల నుంచి గులాబీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే నగరం నలువైపులా గులాబీ స్వాగత తోరణాలు ఏర్పటయ్యాయి. 


టీఆర్ఎస్‌ ప్లీనరీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సీఎం కేసీఆర్‌ ప్రసంగం.. మరోకటి వంటకాలు గురించి. వంటకాలు అంటే అలాంటిలాంటి డిషెస్‌ కాదు. ప్లీనరీలో పాల్గొనే నాయకులకు ఎది తినాలో కూడా అర్థంకాని పరిస్థితి ఉంటుంది.  ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చిన ప్రతి నాయకుని కడుపునిండేలా వెరైటీ.. వెరైటీ పసందైన వంటకాలను వండుతున్నారు. ఈ సారి కూడా 33 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. 


నాన్‌ వెజ్‌ వంటకాల్లో తెలంగాణ నాటుకోడికూర, చికెన్‌ ధమ్‌ బిర్యానీ, ధమ్‌ కీ చికెన్‌, తలకాయ కూర, బోటీ, మటన్‌ కర్రీ, కోడిగుడ్డు పులుసు ఉన్నాయి. ఇక శాఖాహారం వంటకాల్లో మామిడికాయ పప్పు, దొండకాయ, కాజు ఫ్రై, ములక్కాడ, టమాట కర్రీ, చామగడ్డ పులుసు, పప్పుచారు, గుత్తివంకాయ ఉన్నాయి. వాటితో పాటు మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, బగారా, వైట్‌ రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా కూడా సిద్ధం చేస్తున్నారు. అప్పడం, రెండు, మూడు రకాల తొక్కులు, ఉలువచారు క్రీమ్‌, టమాటరసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌ క్రీం, అంబటి, బటర్‌ మిల్క్‌ ను వడ్డించనున్నారు. డబుల్‌ కా మీట, గులాబ్‌ జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీరోటీతో గులాబీ ప్రతినిధులను ఫుల్‌ ఖుష్‌ చేయనున్నారు.


Also Read: Sarkaru Vaari Paata: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28 విడుదల కానున్న "సర్కారు వారి పాట" ట్రైలర్.. 


Also Read: Frustration on Ola: ఓలా స్కూటర్‌పై వినూత్నరీతిలో నిరసన, గాడిదకు కట్టి ఊరేగింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.