TS-bPASS in Telangana: త్వరలో టీఎస్-బీపాస్ మరిన్ని సేవలు.. సర్కార్ కీలక అడుగులు
TS-bPASS Extends its services in Telangana: తెలంగాణలో అమలు అవుతున్న టీఎస్-బీపాస్(TS-bPASS)లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకూ 600 చదరపు గజాలలోపు ఉండే ఇళ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది.
TS-bPASS Extends its services in Telangana: తెలంగాణలో అమలు అవుతున్న టీఎస్-బీపాస్(TS-bPASS)లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకూ 600 చదరపు గజాలలోపు ఉండే ఇళ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది. రెండు నెలల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో అమలు చేస్తున్నారు.
త్వరలో టీఎస్-బీపాస్ ద్వారా అదనపు అంతస్తుల నిర్మాణం, ఇంటి నిర్మాణ విస్తరణ లాంటి సేవలు సైతం అందించేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కొత్త లేఅవుట్‌లకు కూడా టీఎస్-బీపాస్ ద్వారా అనుమతులు జారీ చేయనున్నారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే సంబంధిత శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలను తెప్పించుకుని పరీశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తుంది.
Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు
అయితే నిర్మాణాలకు టీఎస్-బీపాస్(TS-bPASS) అనుమతి పొందిన తరువాత ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఏంటి అనే దానిపై జిల్లా కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు అనుమతులు పొందిన భవనాల నిర్మాణాలను పరిశీలిస్తోంది. నిబందనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే.. ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయడమే కాకుండా క్రిమినల్ చర్యలను తీసుకోనుంది. తప్పుడు పత్రాలు సమర్పించి ఆమోదం పొందినట్లుగా గుర్తిస్తే ఆ అనుమతుల్ని రద్దు చేస్తారు.
Also Read: Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
భవన నిర్మాణాలకు ఎంతమేర చెల్లించాల్సి ఉంటుందో తెలియజేసేందుకు కొత్తగా ఫీజు క్యాలికులేటర్‌ను అధికారులు అందుబాటులోకి తేనున్నారు. వీటితో పాటు నిర్మాణాలలో నిబంధనలు పాటించకపోవడం, నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు గుర్తిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తారు. దరఖాస్తుదారుడు చెల్లించిన నగదును సైతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook