హైదరాబాద్‌: ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, యాంటీ కరప్షన్‌ బ్యూరో), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.


ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌) పతకాలు, పోలీస్‌ సేవా పతకాలు, తెలంగాణ స్టేట్‌ శౌర్య పతకం.. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌/ఫైర్‌ సర్వీసెస్‌/ఎస్‌పీఎఫ్‌ మహోన్నత సేవా పతకం... తెలంగాణ స్టేట్‌ పోలీస్‌/ఫైర్‌ సర్వీసెస్‌/ఎస్‌పీఎఫ్‌ ఉత్తమ సేవా పతకం... తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ కఠిన సేవా పతకాలను అందించనున్నారు. జనవరి 26న సీఎం, మంత్రుల చేతుల మీదుగా ఈ పతకాలను అందించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..