TS ECet counselling schedule: హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 31న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈసెట్‌ ప్రవేశ పరీక్షను ( TS ECET 2020 ) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈసెట్ ఫలితాలు ( TS ECET results 2020 ) విడుదలైన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజాగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించిన ఉన్నత విద్యామండలి.. సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించనుంది. అదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్లను ( TS ECET 2020 web options ) ఎంచుకోవాల్సి ఉండగా 28న అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్‌ 6 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్‌ 6, 7 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపి రెడ్డి ( TSCHE chairman Papi Reddy ) తెలిపారు. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో రేవంత్ రెడ్డి హెచ్చరిక


అక్టోబర్‌ 9న తుది విడత సీట్ల కేటాయింపు ( TS ECET 2020 seats ) ప్రక్రియ చేపట్టి ఆ తర్వాత స్పాట్‌ అడ్మిషన్లకు ప్రత్యేక మార్గదర్శకాలు ( Guidelines ) విడుదల చేయనున్నట్టు పాపిరెడ్డి మీడియాకు వెల్లడించారు. Also read : SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ