తెలంగాణ సర్కారుకు హైకోర్టు అక్షింతలు..!!
కరోనా వైద్య పరీక్షలు, చికిత్స కేవలం ప్రభుత్వాసుపత్రులు లేదా ప్రభుత్వం ల్యాబ్‌లలో మాత్రమే చేయించుకోవాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేసింది.
కరోనా వైద్య పరీక్షలు, చికిత్స కేవలం ప్రభుత్వాసుపత్రులు లేదా ప్రభుత్వం ల్యాబ్‌లలో మాత్రమే చేయించుకోవాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేసింది.
గాంధీ ఆస్పత్రి, నిమ్స్‌లలోనే కరోనా వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవాలన్న తెలంగాణ సర్కారు వాదనను ధర్మాసనం తప్పు పట్టింది. ఇది రాజ్యంగ విరుద్ధమని అభివర్ణించింది. ప్రయివేట్ వైద్య కేంద్రాలు, ల్యాబ్‌లలో డబ్బులు చెల్లించి కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవడం ప్రజల హక్కుని తెలిపింది. ప్రయివేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే.. ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రయివేట్ ఆస్పత్రులకు ఎలా అనుమతి ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది.
మరోవైపు కరోనా వైద్య పరీక్షలు, సేవలను తాము కూడా చేసేందుకు తెలంగాణలోని ప్రయివేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఐతే ఆయా ప్రయివేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను పరిశీలించి..వాటిలో ఉన్న సదుపాయాలను ఐసీఎంఆర్ నోటిఫై చేస్తుందని ధర్మాసనం తెలిపింది. అలా నోటిఫై చేసిన ఆస్పత్రులు, ల్యాబ్‌లలో మాత్రమే పరీక్షలు, చికిత్సకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..