హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫలితాల గందరగోళం అలా కొనసాగుతుండగానే ఇంటర్మీడియెట్ బోర్డ్ తాజాగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 


ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డ్ ఈ ప్రకటనలో పేర్కొంది.