Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..
Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
Inter students Commit Suicide In Telangna: కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు భరించలేని విషాదాన్ని మిగిల్చే పనులను చేశారు. కేవలం ఎగ్జామ్ తప్పడం వల్ల భయపడిపోయి, ఇంట్లో వారు ఏమంటారో, సమాజం ముందు ఎలా ఉండాలో అని తమజీవితాలను మధ్యలోనే ముగింపు పలికారు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర కలకలంగా మారింది. ఇటీవల ఇంటర్ బోర్డు తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయన్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేసింది. అయితే.. దీనిలో కొందరు విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపంతో, కొందరు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడ్డారు. ఒకేరోజులో ఏడుగురు స్టూడెంట్స్ చనిపోవడం ప్రస్తుతం తీవ్రసంచలనంగా మారింది. దీనిపై కాలేజీ సిబ్బంది, ఇటు తల్లిదండ్రులు కూడా కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. ఎగ్జామ్ లలో ఫెయిల్ అయినంతా మాత్రానా.. జీవితాన్ని మధ్యలోనే నూరెళ్ల జీవితానికి ముగింపు పలకడం ఎంతవరకు సమంజసమని అనేక మంది ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా వీరిలో కొందరు ఫెయిల్ అవుతామని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిలో.. సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అదే విధంగా.. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇక.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి తన ఇంట్లో గదిలోకి వెళ్లి మరీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం ఈఘటన తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపేదిగా మారింది.
Read More: Viral Video: నా భార్య సీట్లోనే కూర్చుంటావా..?.. బస్సులో కోట్లాటకు దిగిన భర్తలు.. వైరల్ వీడియో..
ఎగ్జామ్ లలో పొరపాటున ఫెయిల్ అయితే.. మరోమారు రాసి పాస్ కావచ్చుకదా.. కానీ ఇలా అర్ధంతరంగా జీవితాలను ముగించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని అనేక మంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక మరోవైపు కొన్ని కాలేజీలు విద్యార్థులను చదువుపైన భయంకలిగేలా బోధనలను చేస్తు, ఎప్పుడుచూసిన ర్యాంకుల వెనుక పడుతు విద్యార్థులు బలవన్మరణాలకు ఉసిగొల్పే విధంగా కూడా చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.విద్యార్థులకు సున్నిత మనస్కులు. ఇలాంటిపరిస్థితులలో మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురౌతుంటారు. అంతేకాకుండా.. చదుకు అంటేనే ఒక భయంకలిగే విధంగా మారిపోతారు. చివరకు ఇలాంటి దారుణాలకు పాల్పడి తమ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter