TS Inter Results 2023: టీఎస్ విద్యార్థులకు అలర్ట్, ఇంటర్ ఫలితాలు తేదీ ఎప్పుడంటే?
TS Inter Results 2023 Date and Time: గత నెలలో జరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి రిజల్ట్స్ ఎప్పుడు, వాటిని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
TS Inter Results 2023 Date and Time: తెలంగాణ వ్యాప్తంగా గత నెలలోనే ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇంటర్ మొదిటి సంవత్సరం 4,82,677 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. రెండవ సంవత్సరం పరీక్షను 4,65,022 మంది విద్యార్థులు రాశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9.4 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాశారని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరీక్షలు గత నెలలోనే ముగియ్యడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టారు. ఈ రిజల్ట్స్‌ను త్వరగా విడుదల చేసేందుకు అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ క్రమంలో విద్యార్థుల దృష్టి రిజల్ట్స్‌పై పడింది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న ఆసక్తితో ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..తెలంగాణ ఇంటర్ ఫలితాలను వచ్చే నెల (మే) మొదిటి వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ సన్నహాలు చేపడుతుందని సమాచారం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు, రెండవ సంవత్సరం ఫలితాలు రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలోనే విడుద చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగ్గా.. సెకండియర్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వరకు జరిగాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిప్టులో పరీక్షలు జరిగాయి. అయితే ఇంటర్మీడియట్ సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తెలుసుకోవడానికి ఇలా చేయండి:
స్టెప్ 1: ముందుగా tsbie.cgg.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను ఒపెన్ చేయాలి.
స్టెప్ 2: ఒపెన్ చేయగానే హోమ్‌పేజీ వస్తుంది. ఈ పేజీలో TS ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు 2023 లేదా TS ఇంటర్ సెకండియర్ ఫలితాలు అనే చిన్న బార్ కనిపిస్తుంది. మీరు ఏ సంవత్సరం ఫలితాలను కావాలనుకుంటే ఆ సంవత్సరం లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4: ఇలా చేసిన 2 నిమిషాల్లోనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్ 5: ఈ ఫలితాలు డౌన్‌లోడ్ చేయడానికి ఫ్రింట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Also Read: Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook