Minister Malla Reddy: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. మునుగోడు టీఆర్ఎస్ లో కలకలం
Minister Malla Reddy: ఫుల్ బాటిల్ ను పట్టుకుని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి ఫుల్ బాటిల్ లిక్కర్ విజువల్ ను బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ గా వైరల్ చేస్తున్నారు.
Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. బహిరంగంగా మందు తాగితూ కెమెరాలకు చిక్కాడు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి.. ప్రచారం తర్వాత తన అనుచరులతో మందు తాగుతూ బుక్కైపోయారు. ఫుల్ బాటిల్ ను పట్టుకుని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి ఫుల్ బాటిల్ లిక్కర్ విజువల్ ను బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ గా వైరల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే మంత్రి మల్లారెడ్డిని చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు. ఆదివారం గ్రామానికి వెళ్లిన మల్లారెడ్డి.. పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. తర్వాత హైదరాబాద్ పయనమయ్యారు. కాసేపటికి సీన్ కట్ చేస్తే చౌటుప్పల్ గ్రామ శివారులోని ఓ హోటల్ లో మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో మందు పార్టీ చేసుకున్నారు. తనతో వచ్చిన నేతలతో పాటు లోకస్ కేడర్ కు ఫుల్లుగా మందు పోశారు. కార్యకర్తలకు మంత్రి స్వయంగా మందు పోస్తూనే.. తానూ ఓ పెగ్గేశారు. మంత్రి మల్లారెడ్డి ఫుల్ బాటిల్ పట్టుకుని మందు పోస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మల్లారెడ్డి దావత్ చేసుకున్న హోటల్ ను మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ వరకు మంత్రి మల్లారెడ్డి బుక్ చేసుకున్నారని తెలుస్తోంది. హోటల్ నుంచే ఆయన ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. అయితే మంత్రే స్వయంగా మందు పోస్తూ కెమెరాకు చిక్కడం సంచలనంగా మారింది. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హోటల్ లో మద్యం తాగడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంత్రిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మల్లారెడ్డి మందు పోస్తున్న ఫోటోలను బీజేపీ, కాంగ్రెస్ విపరీతంగా వైరల్ చేస్తుండటంతో అధికార పార్టీ కౌంటర్ ఇవ్వలేక కుదేలవుతోంది.
Also Read: UP Rain alert: భారీ వర్షాల ఎఫెక్ట్...యూపీలోని 15 జిల్లాల్లో విద్యాసంస్థల మూసివేత..
Also Read: TSPSC Group 1: వెబ్‌సైట్లో గ్రూప్-1 హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook