TS RTC announces bus points for passengers : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. జనాలంతా నగరాల నుంచి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. సంక్రాంతి (Sankranthi) సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీలు స్పెషల్‌ బస్సులను నడుపుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ (TS RTC) పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రయాణికుల సౌకర్యార్ధం హైదరాబాద్‌లోని (Hyderabad) బస్సు పాయింట్స్‌ను (bus points) అనౌన్స్ చేసింది టీఎస్ ఆర్టీసీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయలసీమ (Rayalaseema) వైపు వెళ్లే బస్సులు సీబీఎస్‌ నుంచి ప్రారంభమవుతాయని టీఎస్‌ పేర్కొంది. అలాగే ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బస్సులు దిల్‌షుఖ్‌నగర్‌ (Dilshukhnagar) నుంచి వెళ్తాయని చెప్పింది. మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, ఖమ్మం, రాయచూరు వైపు వెళ్లే బస్సులు (Buses) ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS Busstand) నుంచి వెళ్తాయని పేర్కొంది టీఎస్ ఆర్టీసీ.


ఇక తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సు పాయింట్ల వివరాలను టీఎస్‌ ఆర్టీసీ (TS‌ RTC) ప్రకటించింది. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, గోదావరి ఖని, ఆదిలాబాద్‌కు వెళ్లే బస్సులు జేబీఎస్‌ బస్టాండ్‌ నుంచి వెళ్తాయి. 


Also Read : Corona in India: ముంబయిలో తగ్గిన కరోనా కేసులు- ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రత


అలాగే వరంగల్, (Warangal) హన్మకొండ, మహబూబాబాద్ బస్సులు ఉప్పల్‌ నుంచి వెళ్తాయి. అయితే ఇలా బస్సు పాయింట్లను ప్రకటించడం వల్ల రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయని టీఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు కోవిడ్ (Covid) నిబంధనలు పాటిస్తూ బస్సుల్లో ప్రయాణం చేయాలని ఆర్టీసీ (RTC) అధికారులు సూచించారు.


Also Read : Maharashtra Corona Cases: మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు.. 46,723 కొత్త కేసులు, 32 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook