TS SET 2024: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..
TS SET 2024 Answer Key: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్ telanganaset.org జవాబు కీ అందుబాటులో పెట్టారు. సెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే కీ చెక్ చేసుకోవచ్చు.
TS SET 2024 Answer Key: తెలంగాణలో లెక్చరర్‌లుగా అన్ని కళాశాలల్లో పనిచేయాలంటే సెట్ పరీక్ష తప్పనిసరి ఈ నేపథ్యంలో సెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన కీ సెప్టెంబర్ 24 నేడు విడుదల చేసింది. ఇది 26వ తేదీ ఎక్స్‌పైర్ అవుతుంది. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ఈ విండో ఈరోజు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఉస్మానియా యూనివర్శిటీ సారథ్యంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
సెట్ రాసిన అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారి హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ ఉపయోగించాల్సి ఉంటుంది. టెస్ట్ రాసిన వారు మాత్రమే యాక్సెస్ పొందుతారు. వారి టాపిక్ మాడ్యూల్ ఆధారంగా టీఎస్ సెట్ వెబ్‌సైట్ లాగిన్ అయి క్వశ్చన్ ఐడీ ద్వారా
అభ్యంతరాలను చెప్పవచ్చు.
ముందుగా టీజీ సెట్ అధికారిక వెబ్‌సైట్ telanganaset.org ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత హోంపేజీలో ఉన్న టీఎస్ సెట్ 2024 జవాబు కీ ని సెలక్ట్ చేయాలి.
మీ వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బట్టన్ పై క్లిక్ చేయాలి.
అంతే అక్కడ మీకు అభ్యంతరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
చివరగా సబ్మిట్ చేసిన తర్వాత పేపర్ కాపీ డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయాలి.
ఇదీ చదవండి: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!
జవాబు కీ డౌన్‌లోడ్ చేసే విధానం..
telanganaset.org అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
ఆ తర్వాత వెబ్ పేజీలో ఉన్న టీఎస్ సెట్ 2024 జవాబు కీ డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయాలి.
అప్పుడు పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన జవాబు కీలపై క్లిక్ చేయండి
మీరు ఎంత స్కోర్ చేశారో తెలుసుకోవడానికి జాగ్రత్తగా జవాబులను రివ్యూ చేయండి
దాన్ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవచ్చు.
ఇదీ చదవండి: ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..
టీఎస్ సెట్ ఎగ్జామినేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు అన్ని యూనివర్శిటీ, కాలేజీల్లో తెలంగాణ వ్యాప్తంగా భర్తీ చేపడతారు. ఇందులో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు, మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులు 35 శాతం మార్కులు సంపాదిస్తే అర్హత సాధిస్తారు.
ఈ పరీక్షలో మొత్తం 29 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం కంప్యూటర్ ఆధారిత టెస్ట్. సెట్ లో రెండు పేపర్టు ఉంటాయి. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తంగా 100 మార్కులకు ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తారు. పేపర్ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులకు నిర్వహిస్తారు. అతి త్వరలో సెట్ ఫలితాలను వెల్లడించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.