TSLPRB: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ప్రిలిమ్స్ పరీక్షలో కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రకటన ద్వారా 200 మార్కులకు గాను ఓసీలకు 30 శాతం అనగా 60 మార్కులు, బీసీకి 25 శాతం(50 మార్కులు), ఎస్సీ,ఎస్టీలకు 20 శాతం అనగా 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. గతకొంతకాలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కటాఫ్ తగించాలని ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. గతకొన్నిరోజులుగా ఏదో డిపార్ట్‌మెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ శాఖలో భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌లతో ఇతర పోస్టులు ఉన్నాయి. ఇటీవల మరిన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. త్వరలో వైద్య శాఖకు సంబంధించిన పోస్టులు భర్తీ కానున్నాయి. ఈవిషయాన్ని ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.


తెలంగాణలో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో 80 వేల ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ, ఇతర బోర్డుల ద్వారా భర్తీ చేస్తామన్నారు. మిగిలిన 10 వేల పోస్టులను రెగ్యూలరైజ్ ద్వారా ఫిల్ చేస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ శాఖ నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి. సింగరేణిలోనూ వివిధ రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చాయి. వాటికి పరీక్షలు సైతం పూర్తైయ్యాయి. 


Also read:Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!


Also read:Viral Video: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు..వీడియో వైరల్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి