TSLPRB Constable Hall Ticket 2022: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ నెల 18న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. హాల్ టికెట్లు ప్రస్తుతం  www.tslprb.in‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇంకా ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉంది. రేపు అర్దరాత్రి 12 గంటలకు హాల్ టికెట్ల డౌన్ లోడ్‌కు గడువు ముగుస్తుంది. కాబట్టి ఇంకా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే డౌన్ లోడ్ చేసుకుంటే బెటర్. లేనిపక్షంలో చివరి రోజు సర్వర్ పనిచేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి :


  1. మొదట http://www.tslprb.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

  2. హోంపేజీలో 'Download Hall Tickets' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  3. మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన సైన్ ఇన్ అవ్వాలి.

  4. అంతే.. స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.

  5. హాల్ టికెట్‌ను ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.


అభ్యర్థులకు కీలక సూచనలు :


  1. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. హాల్ టికెట్‌పై ఫోటో తప్పనిసరిగా ఉండాలి. 

  2. ఫోటో లేకపోయినా, విజిబులిటీ సరిగా లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

  3. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

  4. పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అనుమతించరు.


పోలీస్ శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 28న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు 6.6 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎవరికైనా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే support@tslprb.inకు మెయిల్ చేయాలి. లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలి. 


Also Read: Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో పోలీసుల హైఅలర్ట్..మరో మూడురోజులపాటు కర్ఫ్యూ..!


Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook