TSRTC: తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ప్యాకేజిలు ప్రకటించింది. తక్కువ ధరకే జలపాతాలు, డ్యాంలు చుట్టి వచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మైమరపించే కుంటల, పోచెర జలపాతాల్ని వీక్షించాలనుకునేవారికి ఇదే గుడ్‌న్యూస్. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అందుబాటు ధరలకు అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అదిలాబాద్ జిల్లాలోని కుంటల, పోచెర జలపాతాల్ని చుట్టువచ్చేలా ప్యాకేజ్ రూపొందింది. 


హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఉదయం 5 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. జూబిలీ బస్ స్టేషన్ నుంచి 5.30 నిమిషాలకు ఉంటుంది. చివరిగా కుంటల జలపాతం నుంచి సాయంత్రం 5 గంటలకు బస్సు బయలుదేరి..హైదరాబాద్‌కు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు చేరుకోనుంది. కుంటలలో మద్యాహ్నం భోజన సౌకర్యముంటుంది. 


పెద్దవారికి టికెట్ 1099 రూపాయలు కాగా పిల్లలకు 599 రూపాయలుగా ఉంది. ప్యాకేజ్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడూ ఉంటాయి. టీఎస్సార్టీసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయి.


Also read: Nirmala Sitharaman: కేసీఆర్‌కి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చురకలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook