బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు
హబ్సీగూడ చౌరస్తాలో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: హబ్సిగూడ చౌరస్తా వద్ద ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జనగామ వైపు వెళ్తున్న టిఎస్ఆర్టీసీ బస్సు హబ్సీగూడా చౌరస్తాకు రాగానే బ్రేక్స్ ఫెయిల్ అవడంతో అదుపుతప్పి మూడు కార్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన అనంతరం ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను నియమించుకున్న సంగతి తెలిసిందే.