Tsrtc Cuts Driver Salary : తెలంగాణ ఆర్టీసీలో వింత పోకడ కనిపిస్తోంది. నిర్దేశిత మైలేజీ సాధించలేదంటూ ఓ డ్రైవర్‌కు సంస్థ యాజమాన్యం షోకాజ్ నోటీసులు పంపడం ఆర్టీసీ కార్మికుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని.. లేదంటే జీతం నుంచి కోత తప్పదంటూ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధాని డిపోలో పని చేస్తున్న వెంకన్న అనే డ్రైవర్‌కు డిపో మేనేజర్ షోకాజ్ నోటీసు జారీ చేయడం దుమారం రేపుతోంది. సూపర్‌ లగ్జరీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న మీ వల్ల ఏప్రిల్ నెలలో 102 లీటర్ల మేర డీజిల్  అదనంగా ఖర్చు అయ్యింది. అలా ఎందుకు జరిగిందో కారణం చెప్పకుంటే మీ వేతనం నుంచి 10,710 రూపాయలు కోత తప్పదంటూ తాఖీదు ఇచ్చారు. వెంకన్న వ్యవహారంతో ఆర్టీసీ కార్మికులు షాక్‌కు గురయ్యారు.


సూపర్ లగ్జరీ బస్సు లీటర్‌కు 5.20కిమీ మేర మైలేజీ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు నిర్దేశించారు. వెంకన్న ఏప్రిల్ నెలలో లీటర్‌కు 4.64 కిమీ మైలేజీతో బస్సును నడిపారు. మొత్తం 4400 కిలోమీటర్లు బస్సు నడిపి 948 లీటర్ల ఖర్చు చేశారని సదరు నోటీసులో పేర్కొన్నారు. దీని వల్ల 102 లీటర్లు ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం డిపో 3 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉందనీ.. మీ వల్ల అదనంగా 10 వేల 710 రూపాయలు నష్టం జరిగిందంటూ లెక్కలు గట్టి నోటీసు జారీ చేశారు. ఈ మొత్తాన్ని సదరు డ్రైవర్ జీతం నుంచి కోత విధిస్తామంటూ సదరు నోటీసు సారాంశం.


ఈ వ్యవహారంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. మైలేజీపై అనేక కారణాలు ప్రభావం చూపుతాయన్న విషయం అధికారులకు తెలీదా అని వారు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల సూపర్ లగ్జరీ బస్సు మైలేజీ 4.5-5 కిలోమీటర్లు మించదనీ.. అదే బస్సు దూర పాంత్రాలకు వెళితే 5 నుంచి 5.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటున్నారు.


 కాలం చెల్లిన బస్సులనే ఆర్టీసీలో ఇంకా వినియోగిస్తున్నారని .. డొక్కు బస్సులతో నిర్దేశిత మైలేజీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఐదారేళ్లుగా జీతాలు పెంచలేదనీ.. ఇప్పుడు ఏదో రూపంలో కోత విధించడమేమిటని అంటున్నారు. డ్రైవర్ వెంకన్న వ్యవహారం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


Also Read: Actress Harassed: ప్రముఖ సినీ నటికి వేధింపులు... అసభ్య మెసేజ్‌లు, ఫోన్ కాల్స్... నిందితుడి అరెస్ట్   


Also Read: Suma Accident Video: యాంకర్ సుమకు ఏమైంది, కాలు జారి పడిపోయిన సుమ, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook