TSRTC Free Battery Vehicle Services: ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, చుట్టుపక్కల బస్టాండ్స్‌కు అనుసంధానంగా బ్యాటరీ వెహికల్స్‌ను నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగే ప్రయాణికులు ఈ బ్యాటరీ వెహికల్స్‌లో ఉచితంగా చుట్టుపక్కల బస్టాండ్స్‌కు చేరుకోవచ్చు. రాబోయే 10 రోజుల్లో ఈ బ్యాటరీ వెహికల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల రెథిఫైల్, పటాన్‌చెరు బస్టాండ్, ఉప్పల్ బస్టాండ్, చిలకలగూడ బస్టాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాక... ప్రయాణికులు ఈ బస్టాండ్స్‌కు చేరుకుని తమ గమ్య స్థానాలకు వెళ్తుంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో చేతిలో లగేజీ పట్టుకుని సమీపంలోని బస్టాండ్స్‌కు నడుచుకుంటూ వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక పిల్లలు, లగేజీతో వెళ్లేవారి కష్టాలు చెప్పనక్కర్లేదు. 


ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్రీ బ్యాటరీ వెహికల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు దిగగానే... అక్కడ ఉండే ఫ్రీ బ్యాటరీ వెహికల్స్ ద్వారా ప్రయాణికులు నేరుగా చుట్టుపక్కల బస్టాండ్స్‌కి వెళ్లవచ్చు. టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


ఇటీవలే టీఎస్ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అర్ధరాత్రి తర్వాత కూడా పలు మార్గాల్లో బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి రైళ్లు దిగేవారు బస్సులు లేక ఇబ్బందులు పడుతుండటంతో... ప్రయాణికుల సౌకర్యార్థం కొన్నిమార్గాల్లో నైట్ సర్వీసులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని మార్గాల్లోనూ ఈ నైట్ సర్వీసులను నడిపే అవకాశం ఉంది. 


Also Read: LSG vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వారిదే.. కారణం ఏంటో తెలుసా?


Also Read: Nautapa 2022: నేటి నుంచి నౌతాప.. 9 రోజుల పాటు అల్లాడించే ఎండలు... ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయొద్దు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి