హైదరాబాద్‌: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసి కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. ఇదివరకే టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసును ఇవ్వగా తాజాగా టీఎంయూ సైతం సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తమ డిమాండ్లను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 


ఇకనైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం ఖాయమని అశ్వత్థామ రెడ్డి తేల్చిచెప్పారు.