TSRTC Independence Day Special Offers: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ ఆఫర్స్ వివరాలను వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్ ఇవే :


ఆగస్టు 15న జన్మించిన చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేవరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.


75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.


టీ-24 టికెట్లు ఆగస్టు 15న కేవలం రూ.75కే అందించనున్నారు. సాధారణ రోజుల్లో ఈ టికెట్ ధర రూ.120 ఉంటుంది.


టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ఆర్టీసీ ప్రయాణికులకు రూ.75 మేర తగ్గింపు ఉంటుంది. ఈ నెల 16 నుంచి 21 వరకు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు.


ఆగస్టు 15న కార్గో సర్వీస్‌ ద్వారా రవాణా చేసే ఒక కిలో పార్శిల్స్‌పై 75 కి.మీ వరకు ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు.


ఆగస్టు 15న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పుష్పక్ సర్వీస్‌ను ఉపయోగించుకునే ప్రయాణికులకు 25 శాతం రాయితీ కల్పిస్తారు.


75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్‌ కోసం హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత మెడికల్ క్యాంప్. 


ప్రత్యేక ఆఫర్లతో పాటు జాతీయ భావాన్ని చాటే కొన్ని కార్యక్రమాలను ఆర్టీసీ నిర్వహించనుంది. నేటి (ఆగస్టు 9) నుంచి ఆర్టీసీ ప్రాంగణాల్లో ప్రతీ రోజూ ఉదయం 11గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని ఆర్టీసీ బస్సులపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఆజాదీ కా అమృతోత్సవ్ బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు.


Also Read: Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!


Also Read: Telanana Rain Updates: తెలంగాణలోని ఆ 4 జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు... 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook