టీ సర్కార్, పోలీసులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు: అశ్వత్థామ రెడ్డి
టిఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రభుత్వం తమపై అవలంభించిన వైఖరిపై, సమ్మె సమయంలో ఛలో ట్యాంక్ బండ్ నిరసనలో పోలీసులు తమపై చేసిన దాడులను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలు, మిలియన్ మార్చ్ నిరసనలో పోలీసుల చేతిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను తీసుకుని వెళ్లి గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రభుత్వం తమపై అవలంభించిన వైఖరిపై, సమ్మె సమయంలో ఛలో ట్యాంక్ బండ్ నిరసనలో పోలీసులు తమపై చేసిన దాడులను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలు, మిలియన్ మార్చ్ నిరసనలో పోలీసుల చేతిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను తీసుకుని వెళ్లి గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.