Disha Encounter-Sajjanar: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ
Sajjanar to appear before probe panel: దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది.
TSRTC MD and former Cyberabad police commissioner VC Sajjanar to appear before probe panel: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ (Disha) హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై (Encounter) విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు (supreme court) నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. దిశ ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా (Cyberabad police commissioner) పనిచేసిన వీసీ సజ్జనార్‌ను గురువారం లేదా శుక్రవారం విచారణ చేసే అవకాశముంది. ఇప్పటికే సజ్జనార్‌కు (Sajjanar) త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) (National Human Rights Commission) ముగ్గురు సభ్యుల విచారణ సోమవారం ప్రారంభమై... మంగళవారం కూడా కొనసాగింది.
Also Read : పవన్ ఫ్యాన్స్ పై పోసాని ఫైర్! పవన్ ను కేసీఆర్ తిట్టినప్పుడు స్పందించలేదు ఎందుకు?
మరొక సభ్యుడి విచారణతో బుధవారం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు (Police) విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ (Sirpukar commission) విచారించనుంది. ఇక ఫోరెన్సిక్ బాలిస్టిక్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ నిపుణులను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారణ చేయనుంది. ఇదే నేపథ్యంలో సజ్జనార్‌కు (Sajjanar)ను విచారించనున్నారు.
Also Read : Viral video : మేక పై సవారీ చేసిన కోతి పిల్ల .. నెటిజన్లు ఫిదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook