TSRTC strike latest updates | కార్మికులకు ఆర్టీసీ ఎండి హెచ్చరిక!
తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ(TSRTC MD Sunil Sharma) తేల్చిచెప్పారు. తమంతట తాముగా సమ్మె(TSRTC strike)కు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని.. కార్మికులు ఇప్పటికే యూనియన్ల(TSRTC JAC) మాట విని నష్టపోయారని ఆయన స్పష్టంచేశారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ(TSRTC MD Sunil Sharma) తేల్చిచెప్పారు. తమంతట తాముగా సమ్మె(TSRTC strike)కు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని.. కార్మికులు ఇప్పటికే యూనియన్ల(TSRTC JAC) మాట విని నష్టపోయారని ఆయన స్పష్టంచేశారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని ఆయన కార్మికులకు సూచించారు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవద్దని విజ్ఞప్తిచేశారు.
Read also : ఆర్టీసీ సమ్మె: టీ సర్కార్ విజ్ఞప్తికి నో చెప్పిన హై కోర్టు
ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు ఆందోళనలకు దిగే అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎండి సునీల్ శర్మ హెచ్చరించారు. ఇదే విషయాన్ని హైకోర్టు(Telangana High court)కు కూడా తెలియ చేయడం జరుగుతుందని స్పష్టంచేసిన ఆయన... హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారమే లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు కార్మికులు సంయమనం పాటించాలని కోరుతున్నట్టు తెలిపారు. Read also : టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?