VC Sajjanar Alerts Youth over Qnet Frauds: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్‌ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ ఈ సంధర్భంగా పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీయువకులు మరణించడం బాధాకరమని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం, ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్న ఆయన వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తామని అన్నారు. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్‌ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందన్న సజ్జనార్ ఈ క్యూనెట్‌ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు.


ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్‌ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్‌ మల్టీ లెవల్ మార్కెటింగ్ దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తుందని సజ్జనార్ అన్నారు. క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్షన్నర నుంచి 3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని, ఈ మోసపూరిత క్యూనెట్‌ పై అనేక కేసులు నమోదు చేసినా, ఈడీ ఈ కంపెనీ ఆస్తులు జప్తు చేసినా దాని తీరు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక ఈ క్రమంలో యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్‌ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి, మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి అని పిలుపునిచ్చారు. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండని సజ్జనార్‌ సూచించారు. ఇక మోసపూరిత సంస్థల విషయంలో భవన యజమానులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన ఆ సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకుని అద్దెకివ్వాలని కూడా సూచించారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనార్ ఈ క్రమంలో పేర్కొన్నారు.


Also Read: Sajjala on MLC Results: వచ్చిన ఓట్లన్నీ  టీడీపీవి కావు...మేము హెచ్చరికగా భావించడం లేదు!


Also Read: Rain Fall Allert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు కుండపోతే.. హైదరాబాద్లో పరిస్ధితి ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook