Free Bus Journey Rules: తెలంగాణలో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ఎంతో సులువుగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలకు టీఎస్‌ఆర్టీసీ పలు సూచనలు జారీ చేసింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అర్హులైన వారు ఫొటో  స్పష్టంగా కనిపించేలా,  ఒరిజినల్  గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని Tsrtc ఎండీ సజ్జనార్ తెలిపారు. స్మార్ట్ ఫోన్లలో గుర్తింపు కార్డులను, జిరాక్స్ కాపీలను అనుమతించబోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మహిళల ఉచిత ప్రయాణ స్కీం ద్వారా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 % ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 %  పెరిగింది. ఈనెల 9 నుంచి మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం  ప్రవేశపెట్టింది. ఈ బస్సు సౌకర్యం అనేది ఎక్స్ ప్రెస్,  పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. అమలు చేసిన రోజు నుంచి మహిళలు టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేశారు. అయితే దీని కారణంగా ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయిందన్న విషయం స్పష్టత రాలేదు.. దీని కోసం ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది.


Also read: Coronavirus: గుబులు పుట్టిస్తున్న కరోనా కేసులు..


ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి...


ఉచిత బస్‌ ప్రయాణం సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఈ పథకాన్ని బాలికలు, మహిళలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న వారు తమ వెంట ఒరిజనల్‌ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్ లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది.  ఫొటో కాపీలలు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదుని చెప్పారు. 


గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సజ్జనర్‌. జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టిక్కెట్ తీసుకోవాలని కోరారు.


Also read: Cold Waves: వణికిస్తున్న చలి..పడిపోతున్న ఉష్ణోగ్రతలు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook