TSRTC Offer: ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. వారికి సిటీ బస్సుల్లో ఆ 2 గంటలు ఉచిత ప్రయాణం!
TSRTC Offer: రిజర్వేషన్‌తో.. ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. ఇంటి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు బోర్డింగ్ పాయింట్ వరకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చట!
TSRTC Offer: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వినూతన్న నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. టీ-24 టికెట్లు ప్రారంభించడం, జిల్లా కేంద్రాలకు బస్సుల్లో ప్రయాణం చేసి.. సమస్యలు తెలుసుకోవడం వంటి పనులు చేశారు. తాజాగా మరో వినూత్న ఆపర్తో ముందుకొచ్చారు.
ప్రైవేటు ట్రావెల్స్‌కు పోటీగా పని చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్రావెల్ సంస్థలతో పోటీ పడేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక కొత్త కొత్త ఆపర్లను తీసుకొస్తోంది. దూరపు ప్రయాణాలు చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
కొత్త ఆఫర్ ఏమిటంటే?
ఆర్టీసీ బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసే వారికి ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే 250 కిలో మీటర్లు అంతకన్నా ఎక్కువ దూరాలకు ప్రయాణం చేస్తారో.. వారుకి ఇంటి నుంచి బస్సు బోర్డింగ్ పాయింట్స్ వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.
అంటే.. హైదరాబాద్ నుంచి 250 కిలో మీటర్ల దూరానికి ప్రయాణ చేస్తే. బస్సు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అక్కడి వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే విధంగా 250 కిలో మీటర్లు అంతకన్నా ఎక్కువ దూరం నుంచి టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి హైదరాబాద్ జంటనగరాలకు చేరుకున్నా ఇంటి వద్దకు వెళ్లేందుకు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసే వారు ప్రయాణానికి 2 గంటల ముందు.. హైదారాబాద్‌కు చేరుకున్న తర్వాత 2 గంటల వరకు ఈ సదుపాయం ఉపయోగించుకునే వీలుంది. అయితే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు ప్రయాణికులు తాము రిజర్వేషన్ చేసుకున్న బస్సు టికెట్ చూయించాల్సి ఉంటుంది.
Also read: Hyderabad Student: తరగతి గదిలోనే గొడవపడ్డ స్టూడెంట్స్.. ఆరో తరగతి విద్యార్థి మృతి!!
Also read: Niloufer Hospital: విషాదం.. హైదరాబాద్ నీలోఫర్‌లో ఇద్దరు శిశువుల మృతి, మరో చిన్నారి కిడ్నాప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook