తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 11వ తేది నుండి నిరవధిక సమ్మె చేయాలని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ)తో పాటు ఆర్టీసీ యూనియన్లు పిలుపునిచ్చాయి.  ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్ ప్రాంతంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచాలని తీర్మానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా వేతన సవరణ ఫిట్‌మెంట్ 50 శాతం ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన ఎన్నాళ్ల నుంచో ఉన్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ నిరవధిక సమ్మెకు గుర్తింపు సంఘాలు అన్నీ పిలుపునిచ్చాయని  తెలిపారు.


ప్రభుత్వ పద్ధతి కచ్చితంగా ఆర్టీసీ కార్మికులపై వివక్ష క్రిందకే వస్తుందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సమ్మెలో భాగంగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని.. నిరాహారదీక్షలు చేయాలని భావిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.