Medaram Jatara : తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర (sammakka saralamma jatara) కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ''మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ'' (Medaram with TSRTC) పేరుతో ప్రత్యేక యాప్ ను  ప్రయాణికుల కోసం అందుబాటులోకి  తెచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీవరకు జరగుతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఇది గుర్తింపు పొందింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యాప్ ద్వారా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి మేడారానికి నడిచే బస్సులు, ఛార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. నావిగేషన్‌ సదుపాయం ఉంది. సమీపంలోని హోటళ్లు..వాటిలో అందుబాటులో ఉన్న గదుల సంఖ్య, ఆసుపత్రులు, కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఇందులో పొందుపరిచారు. మొబైల్‌ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌  చేసుకుని ఈ సేవలు పొందొచ్చు.


మేడారం జాతరకు (Medaram Jatara) 50 ఏళ్లుగా ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. గత జాతర సమయంలో 19 లక్షల మంది ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి రూ.30 కోట్ల ఆదాయం లభించింది. అప్పుడు వసూలు చేసిన ఛార్జీలనే ఇప్పుడూ వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సంవత్సరం 3,845 బస్సులు నడుపుతున్నామని... సుమారు 23 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు ఆయన అంచనా వేశారు. 


Also Read: PM Modi Hyderabad tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన ఫుల్‌ షెడ్యూల్ ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook