TSRTC Strike | ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై అశ్వత్థామ రెడ్డి కీలక ప్రకటన
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ముగిసినట్టే కనిపించినప్పటికీ.. తాజాగా టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సమ్మె కొనసాగిస్తున్నట్టుగానే స్పష్టమవుతోంది.
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) ముగిసినట్టే కనిపించినప్పటికీ.. తాజాగా టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సమ్మె కొనసాగిస్తున్నట్టుగానే స్పష్టమవుతోంది. తెలంగాణ సర్కార్(Telangana govt) నుంచి ఎలాంటి షరతులు లేకుండా విధులకు ఆహ్వానిస్తే.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తాము స్పష్టంచేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటే.. కార్మికుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే అనిపిస్తోందని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రానందున.. సమ్మె యధాతథంగా కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అని అశ్వత్థామ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందన కోసం ఇంకా వేచి చూస్తామని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశ్వత్థామ రెడ్డి తేల్చిచెప్పారు. అయితే, అంతకంటే ముందుగా నవంబర్ 23న శనివారం నాడు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ర్యాలీలు చేపడతామని.. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read also : అలా అయితే, సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నాం: టిఎస్ఆర్టీసీ జేఏసి
హైకోర్టు తీర్పు(Telangana High court)ను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న అశ్వత్థామ రెడ్డి... కార్మికులు విధుల్లో చేరినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కార్మికులు ఎవ్వరూ విధుల్లో చేరలేదని.. అలాగే కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని వారికి ధైర్యం చెప్పారు.