హైదరాబాద్: తెలంగాణలో ఎస్పీ వర్గీకరణ చిచ్చు రాజుకుంది. వర్గీకరణ జాప్యాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న మందకృష్ణను జైల్లో పెట్టిన పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోత్కుపల్లిని కూడా అరెస్ట్ చేశారు. ఎస్సీవర్గీకరణ కోసం పోరుబాట పట్టిన మోత్కుపల్లి ..గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోత్కుప‌ల్లి కన్నీరు..


ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అణగదొక్కాలని తెలంగాణ ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు.  తమను అరెస్టులు చేసినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని  హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడకు ఇదే నిదర్శనమంటూ భావోద్వేగానికి గురై ఆయన కన్నీరు పెట్టుకున్నారు. కాగా మోత్కుపల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఆయన్ను రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.