Hyderabad: విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితుడు మృతి..
Hyderabad: కరెంటు షాక్ తగిలి ముగ్గురు యువకులు మృత్యువాత పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు కావడం విశేషం.
Hyderabad Tragedy: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని షేక్‌పేట పారామౌంట్ కాలనీకి చెందిన ఇద్దరు బ్రదర్స్ మరియు వారి స్నేహితుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
మెుదట ఇంట్లోని మోటారు స్విచ్ ఆన్ చేసేందుకు యత్నించిన అనస్ (19) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అయితే అన్నను కాపాడేందుకు ప్రయత్నించిన రిజ్వాన్ (18) కూడా షాక్ తగిలి కిందపడిపోయాడు. అన్నదమ్ములను రక్షించేందుకు యత్నించిన వారి మిత్రుడు రజాక్ (16)కు కూడా ప్రమాదవశాత్తు షాక్ కు గురయ్యాడు. వీరి ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు ఈ దుర్ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. యుక్తవయసులో ఉన్నవారు మృతి చెందడంతో బంధువులు, స్థానికుల అరణ్యరోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. డెడ్ బాడీస్ ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
నిన్న హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పెయింటింగ్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో లోకల్ పీపుల్ ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ, ఆస్టి నష్టాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: IMD Alert: వచ్చే 5 రోజులు భారీ ఎండలు.. హెచ్చరించిన ఐఎండీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి