fake doctors: హైదరాబాద్ : ఒకరు చదివిందేమో పదో తరగతి.. మరోకరు ఇంటర్ పాస్.. అయినా వారు దర్జాగా వైద్యులమంటూ నకిలీ ధ్రువపత్రాలతో ఆసుపత్రినే ప్రారంభించారు. అధికారుల అండదండలతో అనుమతులు పొందిన ఆ ఇద్దరు వైద్యులు దాదాపుగా మూడేళ్లుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలు దండుకున్నారు. ఇది ఎక్కడో అనుకుంటున్నారా..  తెలంగాణ ( Telangana ) రాజధానిలోనే ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఆ ఇద్దరు నకిలీ డాక్టర్లను హైదరాబాద్ (Hyderabad) వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నానికి చెందిన మ హ్మద్‌ సోహెబ్‌ సుభానీ, మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ స్నేహితులు. సోహెబ్‌ ఇంటర్‌ పూర్తిచేసి.. ఓ టెక్నో స్కూల్‌ను నిర్వహించేవాడు. ముజీబ్‌ పదో తరగతి చదివి హుమాయిన్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఆసుపత్రి పెడితే  బాగా సంపాదించుకోవచ్చని ఆలోచించి స్పెషలిస్టులమంటూ రోగులకు వైద్యం చేస్తున్నారు. Also read: BCCI: సబా కరీంపై బీసీసీఐ వేటు!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ అనే పేరుతో ఓ నకిలీ ఆధార్‌కార్డును సృష్టించారు. నకిలీ స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా 2017లో సమీర్ ఆసుపత్రి నిర్వహణకు అనుమతులు పొందారు. ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం ప్రధాన రహదారిలో ఉన్న ఈ సమీర్ ఆసుపత్రికి డీఎంహెచ్‌వో ఆఫిస్ నుంచి 2022 వరకు అనుమతి ఉంది. ఆ ఆసుపత్రికి సుభానీ చైర్మన్‌గా, ఎండీగా ముజీబ్ వ్యవహరిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా చికిత్స చేసి రోగుల దగ్గర నుంచి భారీ ఎత్తున దండుకున్నారు.


అయితే ఈ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించిన మందులను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు.. నకిలీ డాక్టర్లు ( fake doctors ) ముజీబ్‌, సోహెబ్‌ను అరెస్ట్‌చేసి, నకిలీ ధ్రువపత్రాలను, పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి అనుమతులు ఎవరిచ్చారు.. వారికీ ఎవరు సహకరించారు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  Also read: Chiranjeevi: అప్పటి ‘బ్లఫ్ మాస్టర్’కు చిరు ప్రశంసలు