Indoor Stadium Collapsed in Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో 14 మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కనకమామిడిలో ఇండోర్ స్టేడియం కూలిపోయిన సమాచారం అందుకున్న NDRF బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం ఓ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందినదిగా తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. శిథిలాల కింద ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల నుంచి మరొక మృతదేహాన్ని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని రాజేందర్ నగర్ డీసీపీ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి