ముషీరాబాద్‌ నియోజకవర్గం టికెట్ వ్యవహారం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఈ టికెట్ ను ఒక పక్క టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్‌ కోరుతుండగా.. ఇది తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి కేటాయించాలని తాజా మాజీ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో టికెట్‌పై ప్రతిష్టంభన నెలకొంది. ఈ స్టానం ఎవరి కేటాయించాలో తేల్చుకోలేక కేసీఆర్ తలపట్టుకుంటున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత ముషీరాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్‌ పేరు ప్రకటన జరుగుతుందని నియోజకవర్గం లో ప్రచారం జరిగింది. ముషిరాబాద్ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయన కూడా తన పేరు ఖరారు అవుతుందని కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఆయన అనుచరులు రాత్రి గాంధీనగర్‌లోని గోపాల్ ఇంటి వద్ద పెద్దఎత్తున బాణాసంచాలు కాల్చేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. తీరా చూస్తే జాబితాలో గోపాల్‌ పేరు ప్రకటన కాలేదు. దీంతో గోపాల్‌ షాక్ కు గురయ్యారు. 


టీఎస్ నిర్ణయం కోసం బీజేపీ ఎదురుచూపులు
మరోవైపు టీఆర్ఎస్ నిర్ణయం కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ఈ సీటు ఒకరికి ఇస్తే మరోకరు తిరుగుబాటు చేసే అవకాముంది. రెబల్ అభ్యర్ధిని తనవైపు తిప్పుకొని ఆ సీటు కేటాయించాలని బీజేపీ వ్యహాన్ని రచించింది. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేసీఆర్ ఈ స్థానం కేటాయింపు విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒకరి కేటాయిస్తే మరోకరు తిరుగుబాటు చేయకుండా నిలవరించే స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్థానానికి అభ్యర్ధిన ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. దంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆశావహులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్‌ కొనసాగుతుంది.  కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.